రెండు రోజులలో రామ్ చరణ్‌కు మరో సర్జరీ

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన (Buchi Babu Sana) తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్దం అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపధ్యంలో మేకర్స్ వరుస ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సతీష్ కిలారు (Satish Kilaru) కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ది సినిమాలో  రెజ్లింగ్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ కంటితో పాటు మణికట్టుకి గాయాలయ్యాయని తెలిపారు. ఇప్పటికే కంటి సర్జరీ చేయించుకున్న చరణ్, ఇప్పుడు మణికట్టు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు. మరో రెండు రోజులలో ఈ సర్జరీ జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. దీనితో రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

 Read Also: ‘టెర్మినాలియా టోమెంటోసా’.. దాహాన్ని తీర్చే అద్భుత వృక్షం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>