కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా “విద్య విజయోత్సవం” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యా, క్రీడా రంగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల నగదు చెక్కు, ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ (Collector Prateek Jain) మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సంగారెడ్డి జిల్లాకు, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.
Read Also: డైనోసార్ల ప్రపంచంలోకి నారా దేవాన్ష్: నారా లోకేశ్ ఆసక్తికర పోస్ట్!
Follow Us On: X(Twitter)

