బుచ్చిబాబుతో రామ్‌ చరణ్ స్పెషల్ డ్రైవ్ వీడియో వైరల్

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘పెద్ది’ (Peddi) సినిమా ప్రస్తుతం ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చి బాబు సనా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మే 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా, తాజాగా రామ్‌ చరణ్ దర్శకుడు బుచ్చిబాబును ప్రత్యేకంగా డ్రైవ్‌కు తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన బుచ్చిబాబు.. ‘డ్రైవ్‌కు తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ చరణ్ సర్’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వీడియోలో రామ్‌ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు ఇద్దరూ ఎంతో సరదాగా కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘పెద్ది’ సినిమా కోసం ఈ కాంబినేషన్ ఎంత కష్టపడుతోందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: చక్కెరతో ముసలితనం.. యవ్వనాన్ని హరిస్తున్న తీపి రక్కసి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>