కలం, వెబ్ డెస్క్ : భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి ఆంధ్రప్రదేశ్ వేదికైంది. పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శంకుస్థాపన చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
రూ. 15,803 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ఏఎమ్‌సీఏ ప్రాజెక్టు దేశీయ రక్షణ ఉత్పాదక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక కీలక కేంద్రంగా మార్చనుంది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక రక్షణ పరికరాలను నేతలు పరిశీలించారు. ఈ ప్రదర్శనలో సీఎం చంద్రబాబు ఒక అత్యాధునిక తుపాకీని చేతబూని ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం అక్కడ ఉన్నవారందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్టు రాకతో రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.
Read Also: ‘వేసవి విజ్ఞాన శిబిరాలు–2026’పై నారా లోకేశ్ హర్షం
Follow Us On: X(Twitter)

