Mobile Popup Ad
Mobile Popup Ad

ముంబై, అహ్మదాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం.. 12 మంది స్పాట్ డెడ్

కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ముంబై, అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రక్కులు ఢీకొట్టడంతో (Palghar Road Accident) దాదాపుగా 12 మంది మృతి చెందినట్టు సమాచారం. వివాహ వేడుకకు వెళ్తున్న చిన్న ట్రక్కును మరో కంటైనర్ ట్రక్ బలంగా ఢీకొట్టింది.

మొత్తం 40 మందికిపైగా బంధువులు ఆ చిన్న ట్రక్కులో వివాహవేడకకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం పాల్ఘర్ జిల్లా కాసా సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో ట్రక్కు ఢీకొట్టింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. పలువురు ప్రయాణికులు వాహనాల మధ్యలో ఇరుక్కుపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో సుమారు 25 మంది తీవ్రంగా గాయపడి, వారిని కాసాలోని  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం (Palghar Road Accident) కారణంగా ముంబయి–అహ్మదాబాద్ హైవేపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, ప్రాథమిక విచారణ చేపట్టారు. ప్రమాదానికి అతివేగం, నిర్లక్ష్యమే కారణాలుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Read Also: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టికెట్ల షెడ్యూల్ విడుదల

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>