Mobile Popup Ad
Mobile Popup Ad

సుడిగాలి సుధీర్ కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది

కలం, వెబ్ డెస్క్ : జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న ప్రముఖ నటుడు, యాంకర్ సుడిగాలి సుధీర్ నుంచి మరో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మే 19న సుధీర్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతని కొత్త సినిమా టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మేరకు సుడిగాలి సుధీర్ కొత్త సినిమాకు ‘సుధీర్‌ జోకర్‌’ (Sudheer Joker) అనే పేరును ఫిక్స్ చేశారు. రిలీజ్ చేసిన పోస్టర్ లో సుధీర్ నోట్లో సిగరేట్, చేతిలో కార్డ్స్ పట్టుకుని భిన్నమైన లుక్ లో కనిపించాడు. పీఎస్ సునీల్ పుష్పాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో ‘బిగ్ బాస్‌’ ఫేమ్‌ అయేషా టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో అభిరామి, మురళీశర్మ, అజయ్‌ ఘోస్‌, రమేశ్‌ ఇందిరా, విష్ణు ఓయ్‌, మురళీధర్‌ గౌడ్‌ ఇతర ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు.

కాగా, సుధీర్ హీరోగా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయినా.. అతనికి అవకాశాలు వస్తుండడం విశేషం. సుధీర్ తాజా చిత్రం ‘గోట్’ పలుమార్లు వాయిదా పడింది కానీ విడుదలకు నోచుకోలేదు. ఇలాంటి సమయంలో సుధీర్ నుంచి మరో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. మరి ఈ సినిమాతోనైన సుడిగాలి సుధీర్ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధిస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>