కలం, సినిమా : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ పెద్ది (Peddi Movie). మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈమధ్య ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను ఇలా రిలీజ్ చేసారో లేదో.. అలా యూట్యూబ్ ని షేక్ చేసింది.. ట్రెండింగ్ లో నిలిచింది. అయితే.. ఈ సాంగ్ ఇప్పుడు వివాదంలోకి వచ్చింది. అదేంటి సాంగ్ రిలీజై చాలా రోజులు అయ్యింది. అప్పుడు ఏమీ రాని వివాదం.. తాజాగా ఇప్పుడు రావడం ఏంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే..
ఇటీవల శివాజీ సామాన్లు అనే పదం స్టేజ్ పై ఉపయోగించడం ఎంత వివాదం అయ్యిందో తెలిసిందే. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుంది. అయితే.. పెద్ది సినిమా (Peddi Movie)లోని ‘చికిరి చికిరి’ పాటలో ‘సరుకు సామాన్’ అనే పదాలు ఉన్నాయి. సాంగ్ రిలీజైనప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. శివాజీ చేసిన సామాన్లు కామెంట్స్ తర్వాత పెద్ది లిరిక్స్ పై ఫోకస్ పడింది. ఇందులో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యువకుడుగా నటిస్తున్నాడు. అక్కడ తీపి పదార్ధాన్ని చికిరి అని పిలుస్తారట. అందుకనే.. ఈ పాటలో చికిరి అని పిలుస్తుంటాడు..
ఉత్తరాంధ్ర యాసలో హీరో రామ్ చరణ్.. హీరోయిన్ జాన్వీ కపూర్ ని చికిరి అని పిలుస్తాడు. అలా పాటలో ఓ.. చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ… పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా సరుకు సామాను సూసి.. అని పాడుతాడు పెద్ది. ఇప్పుడు వివాదం ఏంటంటే.. హీరోయిన్ సరుకు సామాన్ గురించి హీరో మాట్లాడొచ్చా.. అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో పెద్ది సాంగ్ వివాదస్పదం అయ్యింది. దీంతో పెద్ది సాంగ్ ఇప్పుడు మరింతగా వైరల్ అవుతుంది. మరి.. ఈ వివాదం గురించి పెద్ది టీమ్ రియాక్ట్ అవుతారేమో చూడాలి.
Read Also: ప్రభాస్ మీద నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Follow Us On: Instagram


