Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాలకు వర్ష సూచన

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు తేలికపాటి వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొంటూ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

మరోవైపు రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో రైతులకు (Farmers) తీవ్ర నష్టం వాటిల్లింది. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో వరి, పత్తి, ఇతర పంటలకు భారీ నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం కూడా వర్షానికి తడిసి నష్టపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read Also : ఎగ్జామ్ పేపర్లను జిరాక్స్ సెంటర్లలో అమ్మింది బీఆర్ ఎస్ : సీఎం రేవంత్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>