కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో(T20 World Cup) భారత్‌కు ఇప్పుడు డూ ఆర్ డై పరిస్థితి ఏర్పడింది. సెమీఫైనల్ ఆశలు నిలుపుకోవాలంటే జింబాబ్వేపై తప్పనిసరిగా గెలవాలి. ఈ క్రమంలో చెన్నైలో నేడు ఆ జట్టుతో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్ కీలకంగా మారింది.
సూపర్ 8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయంతో జట్టు నెట్ రన్‌రేట్ -3.80కి పడిపోయి పాయింట్లు లేకుండా నిలిచింది. దీంతో సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. సూపర్ 8 గ్రూప్ 1లో భారత్‌తో పాటు దక్షిఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, ఇండియా జట్లు ఉన్నాయి. సెమీఫైనల్‌కు చేరాలంటే భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో జింబాబ్వే, వెస్టిండీస్‌పై గెలవాల్సి ఉంటుంది. అలాగే నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపర్చుకోవాలి.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న భారత్–జింబాబ్వే (IND vs ZIM) మ్యాచ్ దాదాపు నాకౌట్‌లా మారింది. వెస్టిండీస్ చేతిలో భారీ ఓటమి చెందిన జింబాబ్వే కూడా ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం పోటీ పడుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లు ఒక్కో పాయింట్ పంచుకుంటాయి. అప్పుడు భారత్‌కు రెండు మ్యాచ్‌లలో ఒకే పాయింట్ మాత్రమే ఉంటుంది. చివరి మ్యాచ్ గెలిచినా గరిష్టంగా మూడు పాయింట్లకే పరిమితం అవుతుంది.
అలాంటి పరిస్థితుల్లో ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా లేదా వెస్టిండీస్ జట్లలో ఒకటి ఆధిపత్యం చెలాయించాల్సిన అవసరం ఉంటుంది. నెట్ రన్‌రేట్ కూడా కీలకంగా మారుతుంది. ఫిబ్రవరి 26న చెన్నై వాతావరణం సాధారణంగా ఉండే అవకాశముంది. సాయంత్రం ఉష్ణోగ్రతలు మధ్య 20 డిగ్రీల వద్ద ఉండే అవకాశం ఉంది. భారీ వర్షానికి సూచనలు లేకపోయినా తీర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.
తేలికపాటి జల్లులు పడితే ఓవర్లు తగ్గే అవకాశం ఉండటంతో నెట్ రన్‌రేట్‌పై ప్రభావం పడవచ్చు(T20 World Cup). భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే నాలుగు పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి సెమీఫైనల్ అవకాశాలు నిర్ణయమవుతాయి. ఒక మ్యాచ్ మాత్రమే గెలిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా ఈ మ్యాచ్ ఫలితం గ్రూప్ స్థితిగతులను ప్రభావితం చేసే అవకాశముంది. సెమీఫైనల్ రేసులో స్పష్టత రానుంది.
Read Also : రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సెకండ్ సింగిల్ బిగ్ అప్డేట్
Follow Us On : WhatsApp

