కలం, వెబ్‌డెస్క్: Nandi Worship | నందీశ్వరుడు కేవలం శివుని వాహనం మాత్రమే కాదు, శివునికి అత్యంత ప్రీతిపాత్రుడైన పరమ భక్తుడు, శివగణాలకు అధిపతి కూడా. మనం శివాలయానికి వెళ్లినప్పుడు నంది చెవిలో మన కోరికలు చెబుతుంటాం. అయితే దీని వెనక ఒక ఆధ్యాత్మిక కారణం (Spiritual Reason) ఉంది. మన కోరికలను నంది చెవిలో చెబితే, నందీశ్వరుడు తగిన సమయంలో ఆ విషయాలను శివుని దృష్టికి తీసుకెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా భక్తుల ఆవేదనలను, కోరికలను నేరుగా కైలాసనాథుడికి చేరవేసే ఒక నమ్మకమైన ‘రాయబారి’ గా నందిని భావిస్తారు.
హిందూ సంప్రదాయంలో శివాలయ దర్శనానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. మనం శివాలయానికి వెళ్లినప్పుడు ఆ పరమశివుడిని దర్శించుకోవడానికి ముందే నందీశ్వరుడిని పూజించడం (Nandi Worship) ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే శివాలయానికి వెళ్లిన భక్తులు గబా గబా వెళ్లి నంది చెవిలో కోరికలు చెబుతుంటారు. కానీ నందీశ్వరుడి చెవిలో కోరికలు చెప్పేందుకు కూడా ఒక నిర్ధిష్టమైన పద్ధతి ఉంటుందని మీకు తెలుసా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే, నందీశ్వరుడి అనుమతి లేనిదే ఆ మహాదేవుడికి మీ మాట అస్సలు చేరదు. అందుకే ముందుగా భక్తులు ఆ నందీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలి. దాని కోసం నంది దగ్గరకు వెళ్లగానే మొదటగా చేతులు జోడించి, ప్రశాంతమైన మనసుతో “హర హర మహాదేవా” లేదా “ఓం నమఃశివాయ” అని కచ్చితంగా మూడు సార్లు జపించాలి. ఇలా మనస్ఫూర్తిగా జపిస్తున్నప్పుడు మన శరీరంలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ రావడాన్ని, కష్టాలన్నీ తీరిపోతాయన్న ధైర్యం కలగడాన్ని మనం గమనించవచ్చు. ఆ నమ్మకమే ఇక్కడ అత్యంత ముఖ్యమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఇలా మూడు సార్లు శివనామాన్ని స్మరించిన తర్వాతే నందీశ్వరుడిని మనసారా వేడుకోవాలి.
ఆ తర్వాత “బసవ బసవేశ్వర బసవరాజ నందీశ్వర పాహిమాం” అని స్తుతించాలి. ఈ విధంగా నందీశ్వరుడిని భక్తితో ప్రార్థించిన తర్వాత మాత్రమే మీ అసలైన కోరికను ఆయనకు నివేదించవలసి ఉంటుంది. ఇక్కడే మరో పవర్‌ఫుల్ రహస్యం కూడా దాగి ఉంది. మీ మనసులోని కోరికను ఎల్లప్పుడూ నంది యొక్క ఎడమ చెవిలోనే చాలా రహస్యంగా, ఇతరులకు వినపడకుండా చెప్పాలి. అప్పుడూ మీ కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
Read Also: నీట్ పేపర్ లీకులపై మోదీ మౌనం వీడాలి: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp

