Mobile Popup Ad
Mobile Popup Ad

భోపాల్‌లో నేడు గ్రాండ్‌గా ‘పెద్ది’ మ్యూజికల్ ఈవెంట్

కలం, సినిమా : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో (Bhopal) నేడు భారీ స్థాయిలో ‘పెద్ది’ (Peddi) మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ ఈవెంట్‌లో ‘పెద్ది’ సినిమా నుంచి రెండు పాటలను ఏఆర్ రెహమాన్ లైవ్‌లో ప్రదర్శించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన గత చిత్రాల హిట్ సాంగ్స్‌ను కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ రూపంలో వినిపించే అవకాశం ఉంది.

‘పెద్ది’ టీం ప్రకారం ఈ ఈవెంట్‌ను సినిమా ప్రమోషన్స్‌లోనే అతిపెద్ద కార్యక్రమంగా ప్లాన్ చేశారు. అభిమానులకు ప్రత్యేక అనుభూతి కలిగించేలా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భోపాల్‌లోని బిహెచ్ఇఎల్ దసరా గ్రౌండ్స్‌లో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. వేలాది మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>