Mobile Popup Ad
Mobile Popup Ad

యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ భూమి పూజ

కలం, యాదగిరిగుట్ట: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం యాదగిరిగుట్ట (యాదాద్రి) లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర పరిధిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన వైభవంగా భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సీఎం రేవంత్ రెడ్డి శాస్త్రోక్తంగా భూమి పూజలో పాల్గొన్నారు. భూదేవి పూజ, నవగ్రహ పూజలతో పాటు ప్రత్యేక మంత్రపుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రికి రక్షాబంధనం (కంకణ ధారణ) చేసి ఆశీర్వచనాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల నిత్యజీవన సౌభాగ్యం, సుఖసంతోషాలు, రాష్ట్ర అభ్యున్నతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శంకుస్థాపన అనంతరం పండితులు సీఎం రేవంత్ రెడ్డికి వేద సమృద్ధి, శాస్త్ర సమృద్ధి కలగాలని వేదోక్తంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆలయ ఈఓ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>