Mobile Popup Ad
Mobile Popup Ad

ఢీ డ్యాన్సర్ పండు మాస్టర్ కి రోడ్డు ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా పాపులర్ అయిన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ (Pandu Master) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తగరపువలస అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రయాణం మధ్యలో పండు టీమ్‌లోని ఒక సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో డ్రైవర్ రోడ్డుపక్కన కారును ఆపాడు.

ఈ సమయంలో పండు మాస్టర్ కారులో నుంచి దిగి రోడ్డుపై నిలబడి ఉండగా.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కోళ్ల వ్యాన్ నియంత్రణ కోల్పోయి నిలిచి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో మాస్టర్ ప్రయాణిస్తున్న కారుతో పాటు, దాని ముందు ఆగి ఉన్న మరో బొలెరో వాహనం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో కారు పక్కనే నిలుచున్న పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయలయ్యాయి. తీవ్ర రక్త స్త్రావంతో బాధపడుతున్న ఆయన్ని స్థానికులు , సహచరులు కలిసి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. పండు మాస్టర్ ఆరోగ్యంపై వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>