Mobile Popup Ad
Mobile Popup Ad

ముంబైలో మాస్ ట్రీట్‌కు సిద్ధం అవుతున్న ‘పెద్ది’..

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ (PEDDI).. ఎట్టకేలకు జూన్ 4న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా మేకర్స్ భారీ ప్రమోషన్స్‌కు రెడీ అయ్యారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ‘పెద్ది’ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు పెంచేలా మరో అప్డేట్ ఇచ్చారు. చిత్ర అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ‘ముంబై.. అతని పేరు గుర్తుంచుకోండి, పెద్ది వస్తున్నాడు’ అంటూ స్పెషల్ ప్రోమోతో పాటు ట్రైలర్ అప్డేట్‌ను విడుదల చేసింది. మే 18 నుంచి ‘పెద్ది’ ట్రైలర్ సందడి ప్రారంభం కానుందని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తాజాగా విడుదలైన ఈ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>