Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డి జిల్లాలో రైతుల నిరసన.. రోడ్డుపై ధాన్యం పోసి!

క‌లం మెద‌క్ బ్యూరో: ధాన్యం కొనుగోలు చేయ‌లంటూ సంగారెడ్డి జిల్లా (Sangareddy) చౌటకూర్ మండ‌లం సుల్తాన్ పూర్ వద్ద నాందేడ్ -అకోలా జాతీయ రహదారిపై కోర్పోల్ గ్రామ రైతుల ధర్నా నిర్వ‌హించారు. కోతలు కోసి నెలలు కావ‌స్తున్నా.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని తీవ్రంగా నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ధాన్యాన్ని ర‌హ‌దారిపై పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్ర‌భుత్వం దిగొచ్చి.. ధాన్యం కొనుగోళ్లు చేస్తామని హామీ ఇచ్చేవరకు ధ‌ర్నా విరమించబోమని స్పష్టం చేశారు. ప్ర‌భుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాలను క్షేత్ర స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. రైతుల ధ‌ర్నా కార‌ణంగా సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలిసులు రైతుల‌కు న‌చ్చ‌జెప్పి ధ‌ర్నాను విర‌మింప‌జేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>