తల్లాడలో అక్రమ ఇసుక రవాణాపై దాడులు.. రెండు లారీలు సీజ్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా తల్లాడ (Tallada) మండలం రామానుజవరం గ్రామంలో అక్రమంగా ఇసుక (Illegal Sand Transport)ను తరలిస్తున్న రెండు లారీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు రూ. 60,000 విలువ చేసే ఇసుకను, రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

​ఈ దాడుల్లో యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం చిమ్మిర్యాల గ్రామానికి చెందిన లారీ యజమాని, డ్రైవర్ సోరివి నరేష్ (38), అలాగే నల్గొండ జిల్లా చిట్యాల మండలం శివనేగూడెం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ యెట్లి నవీన్ (33) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, TS30TA2345 నంబరు గల లారీ యజమాని, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ గ్రామానికి చెందిన అరుట్ల రాజు (40) పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. TG30TA2347, TS30TA2345 నంబర్లు గల రెండు ఇసుక లోడు లారీలను స్వాధీనం చేసుకుని, నిందితులపై తల్లాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>