భట్టిపై విమర్శలు.. మధిర కాంగ్రెస్ నాయకుల ఘాటు స్పందన

కలం, మధిర: మధిర (Madhira)లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)పైబీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ చేసిన ఆరోపణలపై మధిర మండల కాంగ్రెస్ పార్టీ (Congress) అధ్యక్షులు పారుపల్లి విజయకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మధిర అభివృద్ధికి కమల్‌రాజ్ ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మధిరకు తెచ్చిన నిధులు, రహదారులు, అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లందులపాడు వద్ద అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి ప్రజలందరికీ తెలుసని, నేటికీ నిరుపేదలు అద్దె ఇళ్లలో, గుడిసెల్లో జీవించడానికి బీఆర్ఎస్ పాలనే కారణమని విమర్శించారు.

దెందుకూరులో దళిత మహిళకు అన్యాయం జరిగితే విచారణ జరిపించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మధిర భవిష్యత్తు కోసం చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికను, గేదెల పంపిణీ విధానాన్ని విమర్శించడం సరికాదన్నారు. మధిర, ఎర్రుపాలెం మండలాల రైతులకు సాగునీటి భరోసా కల్పించేందుకు రూ.630.30 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవకు నిదర్శనమని కొనియాడారు. భట్టి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, చేతనైతే తమ వెంట వచ్చి జరుగుతున్న అభివృద్ధి పనులను కళ్లారా చూడాలని విజయకుమార్ సవాల్ విసిరారు.

​ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, జిల్లా సెక్రెటరీ పులిబండ్ల చిట్టిబాబు, సీనియర్ నాయకులు సూరం శెట్టి కిషోర్, నియోజకవర్గం అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, దెందుకూరు సర్పంచ్ పగిడిపల్లి శ్రీనివాసరావు, బిట్రా ఉద్దండయ్య, షేక్ జాకీర్ హుస్సేన్, గంగరాజు, షేక్ గౌసుద్దీన్, కమలాకర్, వెంపటి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>