కలం, వెబ్‌డెస్క్: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో రూపొందిన సినిమా ఇది. పైగా, సంక్రాంతికి వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. జనవరి 12న ఈ భారీ, క్రేజీ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే మరింత బజ్ పెంచేసింది. ఇదే క్రమంలో అనిల్ నెక్ట్స్ టార్గెట్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
దీని గురించి అనిల్.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హింట్ ఇచ్చాడు. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా పెద్ద హిట్ అయితే చరణ్‌తో మూవీ ఉంటుందని చెప్పాడు. ఈ సినిమా ట్రైలర్‌ను ఫస్ట్ చరణ్‌కే చూపించానని, ఆయన ఎక్స్ట్రార్డినరీగా ఉందన్నారంటూ.. అనిల్ అసలు విషయం బయటపెట్టాడు. అయితే.. చరణ్‌తో సినిమా అంటే, అది పాన్ ఇండియా స్థాయి అయ్యుండాలి. అనిల్ ఏమో ఇంత వరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు.
మరి.. నిజంగా చరణ్, అనిల్ కాంబో ఉంటుందా అంటే.. ‘మన శంకర వరప్రసాద్’ గారు బ్లాక్‌బస్టర్ అయితే కచ్చితంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పెద్ద హిట్ సాధిస్తే.. చరణ్‌తో పాన్ ఇండియా సినిమా చేయాలని అనిల్ ముందుగానే ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకనే ఇలా హింట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి (Anil Ravipudi) వరుసగా సక్సెస్ సాధిస్తున్నప్పటికీ.. ఏదో లక్ వలన హిట్ అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేసి హిట్ కొట్టి ఆ విమర్శలకు చెక్ పెట్టాలని అనుకుంటున్నాడట. మొత్తానికి అనిల్ నెక్ట్స్ టార్గెట్ అయితే చరణే అని క్లారిటీ వచ్చింది. మరి, అనిల్ అనుకున్నట్లుగా చరణ్‌తో మూవీ ఫిక్స్ అవుతుందేమో చూడాలి.
Read Also: సిక్సర్లతో చెలరేగిన సూర్యవంశీ.. సిరీస్ యువ భారత్‌దే
Follow Us On: Instagram


