కలం, వెబ్‌డెస్క్: తన శరీర మార్పులకు కారణం ప్లాస్టిక్ సర్జరీ(Plastic Surgery) కాదని, ఇలాంటి వార్తలు నిజం కావని నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) పేర్కొన్నారు. మారిన ఆమె రూపానికి కఠిన వ్యాయామమే కారణమని, సర్జరీ కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ కు సమాధానంగా ఆమె ఇలా స్పందించారు. ఇలాంటి తప్పడు పోస్టులు పెట్టే వారితో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
‘ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్’గా చెప్పుకునే డాక్టర్ ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి రకుల్ పాత, కొత్త ఫోటోలను పోల్చి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆమె ముక్కు సర్జరీ, బోటాక్స్ వంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారని ఆరోపించాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందించారు.
‘డాక్టర్లమని చెప్పుకుని, ఎలాంటి ఫ్యాక్ట్ చెక్ లేకుండా స్టేట్‌మెంట్స్ ఇవ్వడం భయానకం. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు’ అంటూ.. రకుల్ రాసుకొచ్చారు. తాను పురాతన, ఆధునిక సైన్స్‌ను అర్థం చేసుకున్న నటిగా, ఎవరైనా సర్జరీలు చేయించుకుంటే తనకు అభ్యంతరం లేదన్నారు. కానీ కఠిన వ్యాయామం చేసి బరువు తగ్గొచ్చు అనే విషయం కూడా గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి డాక్టర్ల పట్ల జాగ్రత్త అవసరం అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ‘దే దే ప్యార్ దే 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్‌తో కలిసి నటిస్తున్నారు. త్వరలో ‘ఇండియన్ 3’ వంటి ప్రాజెక్టుల్లో కనిపించనున్నారు.
Read Also: ఓజీ డైరెక్టర్‌కు పవన్ కళ్యాణ్ కాస్ట్లీ గిఫ్ట్, ప్రత్యేకత ఇదే!
Follow Us On: Youtube


