కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో బిజిగా ఉన్నారు. మంగళవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు. తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో 105 YIIRSలు ఏర్పాటు చేయనున్నామని, YIIRSలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని వివరించారు. YIIRSల నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్యయమవుతుందని, ఈ మొత్తానికి తీసుకునే రుణాలకు ఎఫ్ఆర్‌బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
Read Also: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నుమాయిష్ వచ్చేస్తోంది!
Follow Us On: X(Twitter)


