కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు రాకేశ్ బేడీ (Rakesh Bedi) సారా అర్జున్‌ను ముద్దుపెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌పై స్పందించారు. ‘ధురంధర్’ సినిమా ట్రైలర్ లాంచ్ సమయంలో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. సారా తన వయసులో సగానికంటే తక్కువ అని, సినిమాలో ఆమె తన కూతురిగా నటించిందని ఆయన గుర్తుచేశారు. షూటింగ్ సమయంలో కూడా ఆమె తనను తండ్రిలాగే భావించి ఆప్యాయంగా పలకరించేదని, ఆ రోజు వేడుకలో కూడా అదే తండ్రీకూతుళ్ల అనుబంధంతో తాను ప్రవర్తించానని ఆయన స్పష్టం చేశారు.
ప్రేక్షకుల ఆలోచనా దృక్పథంలోనే లోపం ఉందని, ఒక వృద్ధుడు ఒక యువతిపై చూపించే ఆప్యాయతను తప్పుగా చిత్రీకరించడం సరికాదని రాకేశ్ బేడీ (Rakesh Bedi) అసహనం వ్యక్తం చేశారు. ఆ వేడుకలో సారా (Sara Arjun) తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారని, అంతమంది ముందు తాను ఎందుకు తప్పుగా ప్రవర్తిస్తానని ఆయన ప్రశ్నించారు. కేవలం సోషల్ మీడియాలో అనవసరమైన వివాదాలు సృష్టించడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తన దశాబ్దాల కెరీర్, తన పని తీరే విమర్శకులకు సమాధానం చెబుతుందని ఆయన ధీటుగా బదులిచ్చారు.
Read Also: సొరకాయతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ..
Follow Us On: Facebook

