మావోయిస్టులకు భారీ దెబ్బ.. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు పాపారావు లొంగుబాటు!

కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి భారీ షాక్ తగిలింది. పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత పాపారావు (ఎలియాస్ సున్నం చంద్రయ్య) (Maoist Paparao) పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు నేషనల్ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయన ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపారు. సుమారు 12 నుంచి 17 మంది తన సహచరులతో కలిసి పాపారావు బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు.

రూ. 25 లక్షల రివార్డు.. భారీ వ్యూహం

పాపారావుపై (Maoist Paparao) రూ. 25 లక్షల భారీ రివార్డు ఉంది. కాగా, ఆయన లొంగుబాటుకు సంబంధించి మధ్యవర్తులు ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోకి వెళ్లి చర్చలు జరిపారు. కేంద్రం మావోయిస్టుల ఏరివేతకు నడుం బిగించింది. మార్చి 31 నాటికి భారత దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని మోదీ సర్కార్ సంకల్పించింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే, మరోవైపు మావోయిస్టు నేతలు లొంగిపోయేలా చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తోంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత పాపారావు లొంగుబాటుతో  బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు పూర్తిగా సడలినట్లు సమాచారం అందుతోంది.

Read Also: సారా అర్జున్‌తో ముద్దు వివాదం.. క్లారిటీ ఇచ్చిన ధురంధర్ నటుడు

Follow Us On: X(Twitter)

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>