epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘అనగనగా ఒక రాజు’ నుంచి ‘రాజు గారి పెళ్లి రో’ ఫుల్ సాంగ్ అవుట్

కలం, సినిమా : వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) తో అలరించనున్నారు. ప్రమోషనల్ వీడియోస్ లో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘భీమవరం బాల్మా’ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్ ‘రాజు గారి పెళ్లిరో’ విడుదలైంది.

‘అనగనగా ఒక రాజు’ నుంచి డ్యాన్స్ నంబర్ గా విడుదలైన ‘రాజు గారి పెళ్లిరో’ పాట కట్టిపడేస్తోంది. మాస్ తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉత్సాహభరితంగా సాగిన ఈ గీతం.. పండగ వాతావరణాన్ని ముందే తీసుకొని వచ్చింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే పెళ్లి పాటలలో ఒకటిగా ఇది నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ పాటలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అసాధారణ ఎనర్జీతో పాటను మరో స్థాయికి తీసుకొని వెళ్లారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సమకూర్చిన అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో

ఈ పాటను భారీ స్థాయిలో తెరకెక్కించారు. రావు రమేష్ సహా ప్రధాన నటీనటులంతా పాల్గొనడంతో దృశ్య పరంగా ఈ పాట మరింత సంపన్నంగా, సంబరంగా మారింది.

తొలి పాట ‘భీమవరం బాల్మా’కు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత, ఇప్పుడు చిత్ర బృందం ఈ పెళ్లి గీతంతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ‘రాజు గారి పెళ్లిరో’ను అనురాగ్ కులకర్ణి, సమీరా భారద్వాజ్ ఆలపించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం ఈ పాటను పండగ గీతంగా మలిచాయి. రంగురంగుల దృశ్యాలు, ఉత్సాహభరితమైన నృత్య రీతులు, కాలు కదిపేలా చేసే సంగీతంతో ఈ పాట నిజమైన సంబరాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రధాన తారాగణమంతా ఉత్సాహంగా కనిపిస్తూ, ప్రతి ఫ్రేమ్‌లోనూ వైభవం, ఆనందం తొణికిసలాడుతోంది.

ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన కంటెంట్ అంతా ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌తో పాటు ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌ను చిత్ర బృందం విడుదల చేయనుంది. ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకార స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కానుంది.

Read Also: ‘లెనిన్’ అదిరిపోయే అప్‌డేట్‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>