కలం, వెబ్ డెస్క్ : సినీ నటి మాధవీలతను (Madhavi Latha) ఈ సారి తాడిపత్రిలో జరిగే న్యూ ఇయర్ వేడుకలకు పిలిచానన్నారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar). ఈ సారి కూడా తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలను ఒక్కో రోజు ఒక్కో విధంగా నిర్వహిస్తున్నామని.. దానికి చీఫ్ గెస్ట్ గా మాధవీలతనే వస్తోందన్నారు. తామిద్దరి మధ్య ఉన్న విభేదాలకు పులిస్టాప్ పెట్టామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి . ఇద్దరం పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నామని.. అందుకే ఈ సారి ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలిచినట్టు తెలిపారు.
గతేడాది తాడిపత్రిలో ఉన్న పార్కులో కేవలం మహిళలను మాత్రమే న్యూ ఇయర్ వేడుకలకు జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar) ఆహ్వానించారు. ఆ వేడుకపై మాధవీలత ఫైర్ అయ్యారు. ఆ ఈవెంట్ కు మహిళలను వెళ్లొద్దని కోరండం పెద్ద చర్చకు దారి తీసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై సంచలన కామెంట్లు చేశారు. దీంతో వీరిద్దరూ పోటాపోటీగా వీడియోలు పెడుతూ వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు జేసీ చేసిన కామెంట్లతో మరోసారి వీరిద్దరూ వార్తల్లోకి ఎక్కారు. మరి నిజంగానే మాధవీలత వస్తున్నారా లేదా అనేది చూడాలి.
Read Also: సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమాన్ బలవంతుడు : చంద్రబాబు
Follow Us On: Youtube


