Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రపంచ వేదికపై భారత్ స్థాయి పెరిగింది : రాజ్‌నాథ్ సింగ్

కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయంగా భారత దేశం స్థాయి పెరిగింది అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. సోమవారం వియత్నాంలోని (Vietnam) హనోయ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గతంలో భారత్ అంతర్జాతీయ వేదికలపై మాట్లాడినప్పుడల్లా దేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత లభించలేదన్నారు. కానీ, ప్రస్తుతం ప్రపంచ వేదికపై భారత్‌ అభిప్రాయాలకు, సూచనలకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ ప్రతి అడుగును అన్ని దేశాలు శ్రద్ధంగా గమనిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాని మోదీ కారణమని ఆయన తెలిపారు.

అంతేకాకుండా, భారత ప్రధానికి 31 దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను ప్రదానం చేశాయని ఆయన వివరించారు. ప్రపంచంలో మరే దేశ ప్రధాని కూడా ఇంత పెద్ద మొత్తంలో అత్యున్నత పురస్కారాలు అందుకోలేదని గుర్తు చేశారు. భారత దేశ సేవకు మోదీ తనను తాను అంకితం చేసుకున్నారని చెప్పారు. అత్యంత ఎక్కువకాలం ప్రధానిగా వ్యవహరించిన ఘనత నరేంద్ర మోదీకి వర్తిస్తుందని రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) కొనియాడారు.

Read Also: తెలంగాణ పోలీస్ అధికారులకు అమిత్ షా సన్మానం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>