కలం, వెబ్ డెస్క్: ఆఫ్రికా ఖండాన్ని గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్ (Ebola Virus) కాంగో దేశంలో ఉగ్ర రూపం దాల్చుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ వెల్లడించారు. దేశంలోని చాలా ప్రాంతాలను ఈ వైరస్ కమ్మేసిందన్నారు. ఆ దేశంలో ఆరోగ్య పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 344 మంది ఎబోలా పాజిటివ్ రాగా, 60 మంది మరణించారు. WHO ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన విషయం తెలిసిందే.
కట్టుదిట్టంగా నియంత్రణ చర్యలు..
కాంగో (Congo) దేశంలోనే ఎబోలా (Ebola Virus) తీవ్రత అధికంగా ఉన్నా.. దాని ప్రభావం పొరుగునే ఉన్న ఉగాండాపైనా కూడా పడింది. అక్కడ ఇప్పటివరకు 15 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. రోగుల కాంటాక్ట్ ట్రేసింగ్‌ల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని WHO సిబ్బంది చెబుతున్నారు. అదే సమయంలో తూర్పు కాంగోలో తిరుగుబాట్లు, దాడులు, హింసతో అవగాహన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదని వివరిస్తున్నారు. వైరస్ అందుబాటులోకి రాకపోయినప్పటికీ, నియంత్రణ చర్యలు మాత్రం వేగంగానే సాగుతున్నాయని పేర్కొన్నారు.
Read Also: సైన్యం అమ్ముల పొదిలోకి అధునాతన డ్రోన్లు
Follow Us On : WhatsApp

