epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆహా ఏమి రుచి.. నోరూరిస్తున్న రాజస్థానీ ‘గేవర్’ స్వీట్

కలం, నిజామాబాద్ బ్యూరో: సంక్రాంతి అంటే రంగవల్లులు, పతంగులు, కోడి పందాలు మాత్రమే కాదు.. నోరూరించే స్వీట్లు కూడా. అందుకే సంక్రాంతికి నిజామాబాద్‌లో (Nizamabad) స్పెషల్ స్వీట్ లభిస్తుంది. అదే రాజస్థానీ గేవర్.. నిజామాబాద్ రైల్వే గేట్ సమీపంలోని గణపతి దేవాలయం వద్ద గేవర్‌ను ప్రత్యేకంగా తయారుచేసి అమ్ముతారు. ఈ స్వీట్ ఏడాదిలో కేవలం సంక్రాంతి కోసం జనవరి 1 నుంచి 15 వరకు మాత్రమే లభిస్తుంది. ఈ 15 రోజుల్లోనే గేవర్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఉత్తరాది వారు తమ బంధువులకు ఈ గేవర్‌ను (Rajasthani Ghewar) సంక్రాంతి బహుమతిగా పంపిస్తారు.

Nizamabad1

సంప్రదాయ పద్ధతుల్లో నెయ్యితో తయారుచేయడం వల్ల రుచి బాగా ఉండి నోరూరిస్తుంది. అందుకే సంక్రాంతి రాగానే జనాలు గణపతి ఆలయం వద్ద ఉన్న ఆ షాపునకు క్యూ కడతారు. నిజామాబాద్‌తోపాటు నిర్మల్, ఆదిలాబాద్, బాసర, భైంసా, నాందేడ్ వంటి ప్రాంతాల నుంచి కూడా గేవర్ కోసం తెలంగాణ జనాలు పెద్ద ఎత్తున వెళ్లి కొనుగోలు చేస్తారు. ఈ సీజన్‌లో సుమారు 5 నుంచి 10 క్వింటాళ్ల వరకు గేవర్ విక్రయాలు జరుగుతాయి. నెయ్యితో తయారుచేసిన గేవర్ కిలో రూ.600కు సాధారణ గేవర్ రూ.400కు విక్రయిస్తున్నారు. రుచి, నాణ్యత కారణంగా ధర ఎక్కువగా ఉన్నా డిమాండ్ తగ్గడం లేదు.

Nizamabad

ఇక నిజామాబాద్ లోని రాజస్థాన్ గుజరాత్ ఉత్తర ప్రదేశ్ బీహార్ హర్యానా ఢిల్లీలకు చెందిన జనాలు కూడా పెద్ద ఎత్తున సంక్రాంతికి గేవర్ స్వీట్ తీసుకొని వెళ్తారు. నిజామాబాద్‌లోని ఉత్తరాది వాసుల ఇళ్ళల్లో గేవర్ లేనిదే సంక్రాంతి పండుగ జరగదంటే నమ్మరు. గేవర్‌తో పాటు జోద్ పూర్ రుచులు కూడా నిజామాబాద్‌లో దొరకడం విశేషం.. నువ్వులు బెల్లంతో తయారుచేసిన నువ్వుల చిక్కి, గజక్ రోల్, తిల్లి పాపడ్, గజక్ వంటి వెరైటీ స్వీట్లు కూడా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

Nizamabad2

వీటితో పాటు కేసరి పేని ప్రత్యేక ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా రాజస్థాన్లోని జోద్పూర్ స్పెషల్ కేసరి సాంబార్ పేనీలు ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంప్రదాయ ఉత్తరాది వంటకాల రుచిని జిల్లా వాసులకు పరిచయం చేస్తూ, సంక్రాంతి సందడికి ఈ స్వీట్లు మరింత రుచిని అందిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>