కలం నిజామాబాద్ బ్యూరో : రాష్ట్రలో పతంగుల(Kites) మాంజాతో జరుగుతున్న ప్రమాదాలు ఆగడం లేదు. నిజామాబాద్(Nizamabad) జిల్లాలో బైక్‌పై వెళ్తున్న ఓ యువ రైతు(Farmer)కు సింథటిక్ మాంజా(Synthetic Manja) మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి. నవీపేట మండలం నాళేశ్వర్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మణికాంత్ (30) అనే రైతు పొలానికి వెళ్లి పచ్చి గడ్డిమోపును తన బైక్‌పై కట్టుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పాఠశాల వద్దకు రాగానే గాలిపటానికి ఉన్న మాంజా అతని మెడ, చేతులకు చుట్టుకోవడంతో గాయాలయ్యాయి. మణికాంత్‌ను స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి తర్వాత మెరుగైన వైద్యం కోసం నందిపేట మండలంలోని ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పదునైనా మాంజా కారణంగా యువ రైతు గాయపడ్డారని, అది చైనా మాంజా కాదని నవీపేట ఎస్సై శ్రీకాంత్ చెప్పారు.. సంక్రాంతి(Sankranti )కావడంతో ఈ మాంజా విషయంలో బైక్ లపై వెళ్లే వారు నడుచుకుంటూ వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడి నుంచి ఏ మాంజా వచ్చి తగులుతుందోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు.


