Mobile Popup Ad
Mobile Popup Ad

రాజస్థాన్ నాలుగో విజయం.. ఇది ఆరంభమేనంటున్న వైభవ్!

క‌లం, వెబ్ డెస్క్‌: గౌహతీ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరును రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) బ్యాటర్లు బెంబేలెత్తించారు. ఆర్‌బీసీ నిర్దేశించిన లక్ష్యాన్ని రెండు ఓవర్లు మిగిలి ఉండగానే అధిగమించి రాజస్థాన్ ఘన విజయం సాధించింది. ఆర్ఆర్ విజయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. బౌలింగ్ ఎవరు వేసినా క్రీజ్‌లో వైభవ్ ఉన్నాడంటే బౌండ్రీల మోతమోగాల్సిందే అన్నట్లు ఆడాడు. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 26 బంతుల్లో 78 పరుగులతో విరుచుకుపడటంతో, రాజస్థాన్ ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో రజత్ పాటిదార్ 63 పరుగులతో రాణించగా, విరాట్ కోహ్లీ 32, వెంకటేష్ అయ్యర్ 29 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసి మధ్య ఓవర్లలో బెంగళూరును కట్టడి చేశారు.

అయితే, లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడిన వైభవ్, కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఒక భారతీయుడు సాధించిన అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును ఆయన సమం చేశారు. పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి ఐపీఎల్‌లో తమ అత్యుత్తమ స్కోరును నమోదు చేసింది.

వైభవ్ అవుటైన తర్వాత ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. జురెల్ 81 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. రవీంద్ర జడేజాతో కలిసి ఆయన నెలకొల్పిన 68 పరుగుల భాగస్వామ్యం రాజస్థాన్ (Rajasthan Royals) విజయాన్ని ఖాయం చేసింది. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో రాజస్థాన్ బ్యాటర్లు వైభవ్, జైస్వాల్, జురెల్ మొదటి మూడు స్థానాల్లో ఉండటం విశేషం.

ఈ భారీ విజయం అనంతరం వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. వేడుకల కంటే విశ్రాంతికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మరుసటి రోజు ఉదయమే విమానం ఉండటంతో త్వరగా నిద్రపోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. బౌలర్ ఎవరన్నది కాకుండా బంతిని మాత్రమే చూసి తన సహజ సిద్ధమైన ఆటను ఆడానని వివరించారు. ఇది సుదీర్ఘ ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని వారు గుర్తు చేస్తున్నట్లు వైభవ్ పేర్కొన్నారు.

Read Also: మామిడిపండ్లలో ఖరీదైన వెరైటీ తెలుసా? కిలో ధర ఎంతో వింటే షాక్ అవ్వాల్సిందే !

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>