కలం, స్పోర్ట్స్ : ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ లో (RR vs KKR) రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (46), యశస్వి జైస్వాల్ (39) తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కోల్‌కతా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. వరుణ్ చక్రవర్తి (3/14) తన మిస్టరీ స్పిన్‌తో మిడిల్ ఆర్డర్ వెన్ను విరిచాడు. రాజస్థాన్ 81/0 నుంచి కేవలం 75 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు కోల్పోవడం వారి పతనాన్ని సూచిస్తోంది. కార్తీక్ త్యాగి (3/22) డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ రాజస్థాన్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఈ సీజన్‌లో మొదటి గెలుపు కోసం తహతహలాడుతున్న కేకేఆర్‌కు ఇది సులువైన లక్ష్యమే అయినప్పటికీ, ఈడెన్ పిచ్‌పై స్పిన్నర్లను ఎదుర్కోవడం అజింక్య రహానే సేనకు సవాలుగా మారనుంది.
Read Also: అయ్యో అబ్బాయ్.. లేదోయ్ జోడీ!
Follow Us On: Pinterest

