త‌మిళ‌నాడులో భారీ పేలుడు.. 17 మంది మృతి

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌మిళ‌నాడు (Tamil Nadu)లో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ఓ బాణ‌సంచా త‌యారీ కేంద్రంలో జ‌రిగిన పేలుడులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. విరుదునగర్ (Virudhunagar) సమీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానిక రాజ‌కీయ నాయ‌కుడు ముత్తుమాణికంకు చెందిన ఈ ఫ్యాక్ట‌రీలో వ‌ర్క‌ర్స్‌ పనిలో బిజీగా ఉన్న స‌మ‌యంలో స‌డెన్‌గా పేలుడు సంభవించింది. ఈ ప్ర‌మాద‌ తీవ్రతకు నాలుగు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే దాదాపు 10 కిలో మీటర్ల మేర భూమి కంపించినట్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గుర‌య్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు, అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: అనుకున్నదొక్కటి.. మోడీ ప్లాన్ ఢమాల్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>