ప్రధాని మోదీ ప్రారంభోత్సవానికి ముందు రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం!

కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్ (Rajasthan)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బలోహ్రా జిల్లా పచ్‌పద్రలో గల చమురు శుద్ధి కర్మాగారం (Oil Refineries)లో సోమవారం మంటలు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయం కాలేదని, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

అయితే మంగళవారం ఈ రిఫైనరీని ప్రధాని మోదీ (PM Modi) జాతికి అంకీతం చేయాల్సి ఉంది. అనుహ్యంగా ఈ రిఫైనరీలో అగ్ని ప్రమాదం జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో ప్రధాని మోదీ రాజస్థాన్ పర్యటన రద్దు అయింది. కాగా, ఈ ప్రమాదంపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజస్థాన్ ప్రజలకు గర్వకారణమైన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Read Also: అదిరిపోయే కవిత చెప్పిన కేసీఆర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>