అవతార్ 3(Avatar 3)లో రాజమౌళి తీస్తున్న వారణాసి(Varanasi) సర్ ప్రైజ్ ఉండబోతోందంట. ఈ న్యూస్ మహేశ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది. రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న వారణాసిని పాన్ వరల్డ్ మూవీగా తెస్తున్నారు. మొన్న ఈవెంట్ కు హాలీవుడ్ రిపోర్టర్లను పిలిచి ప్రమోట్ చేసుకున్నారు. ఇప్పుడు వారణాసికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడంట. జేమ్స్ కామెరూన్ తీసిన అవతార్ 3 డిసెంబర్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో వారణాసి(Varanasi) స్పెషల్ వీడియోను ప్లే చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడంట. రాజమౌళితో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా దీనికి జేమ్స్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. పైగా అవతార్(Avatar 3) సినిమాకు రాజమౌళి ఇండియాలో ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవతార్ లో వారణాసిని ప్రమోట్ చేస్తే కచ్చితంగా వరల్డ్ వైడ్ బ్రాండ్ ఇమేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రాజమౌళికి తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు. ఇప్పటి దాకా తన సినిమాలకు ఇండియాలోనే ప్రమోట్ చేసిన జక్కన్న.. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగేలా కనిపిస్తున్నాడు. మహేశ్ సినిమా వరల్డ్ వైడ్ గా వెళ్లేలా కనిపిస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read Also: అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ అప్పుడే..!
Follow Us On: Facebook


