తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులకు జారీ చేసింది. హిల్ట్ పాలసీ (HILT Policy) వెనుక భారీ స్కామ్ ఉందని బీఆర్ఎస్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా ఈ పాలసీని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపు విరుద్ధమని, జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని వారు ఆరోపించారు. ఈ పాలసీపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ల వాదనలు ఏమిటి?
HILTP పేరుతో ప్రభుత్వమే 9292 ఎకరాలను అక్రమంగా కేటాయించిందని పిటిషనర్లు ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలు, అధికారుల ప్రమేయం ఉన్నందున రాష్ట్రస్థాయి దర్యాప్తు విశ్వసనీయంగా ఉండదనే వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే, సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు(HILT Policy)లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కు వాయిదా వేసింది.
Read Also: రాజసానికి కేరాఫ్.. హైదరాబాద్ హౌస్
Follow Us On: Pinterest


