భూ వివాదంలో చిక్కుకున్న తమ్మినేని.. కేసు నమోదు

కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం (Thammineni Seetharam) భూ వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు తమ్మినేనిపై కేసు నమోదయింది. శ్రీకాకుళం జిల్లాలో ల్యాండ్ గ్రాబింగ్ వ్యవహారంపై తమ్మినేనితోపాటు ఆయన సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌తోపాటు పలువురిపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం సమీపంలోని చాపురం సత్యసాయి నగర్‌లో ఉన్న 900 గజాల భూమిని నకిలీ పత్రాల ఆధారంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కంప్లైంట్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ భూమి విలువ సుమారు రూ.4 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.

ఈ భూమి అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తికి చెందిందని.. ఆయన జీవించి ఉండగానే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు (డెత్ సర్టిఫికెట్) సృష్టించి, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆమదాలవలస సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ లో భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై గోవిందరాజులు అల్లుడు కనకలింగేశ్వరరావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Thammineni Seetharam), ఆయన సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌లపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని అన్నారు.

Read Also: ఏపీలో కరోనా కల్లోలం.. మరో వ్యక్తికి పాజిటివ్ !

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>