కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి చక్కటి అవకాశం. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు (Assistant Jobs) నోటిఫికేషన్ జారీ అయింది. ఇవి క్లాస్–3 ఉద్యోగాలు. జులై 18వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్ 7వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఆ తరువాత అప్లై చేసినవారివి పరిగణనలోకి తీసుకోరు. పూర్తి వివరాలకు వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు ఇవే..
మొత్తం 500 అసిస్టెంట్ పోస్టుల్లో ఏపీలో 14 పోస్టులు, తెలంగాణలో 15 పోస్టులు కేటాయించారు. ఏపీలోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని సెంటర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
నాలుగు దశల్లో ఎంపిక..
ఉద్యోగాల ఎంపిక నాలుగు దశల్లో నిర్వహిస్తారు. మొదట ఆగస్ట్ 27వ తేదీన వంద మార్కులకు ప్రిలిమ్స్ నిర్వహిస్తుంటారు. దీనిలో క్వాలిఫై అయినవారికి అక్టోబర్ 30న 200 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కూడా ప్రతిభ చూపినవారికి రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడుతారు. అనంతరం, చివరగా మెడికల్ టెస్ట్ పెట్టి.. పాసైన వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ఈ మూడింటిపై పట్టు సాధించాలి..
ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టులే ప్రధానంగా ఎగ్జామ్ పేపర్లు ఉంటాయి. అందుకే, అభ్యర్థులు వీటిపైనే ప్రధానంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడంతో పాటు డైలీ మాక్ టెస్టులు రాస్తూ పట్టు సాధించుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు విడిగా కాకుండా, కంబైన్డ్ ప్రిపరేషన్ చేయడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు.
సొంత రాష్ట్రంలోనే కొలువు..
అసిస్టెంట్ పోస్టులకు (Assistant Jobs) ఎంపికైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మంచి వేతనాలు, సౌకర్యాలతో పాటు నిరంతర పదోన్నతులతో రిటైర్మెంట్ నాటికి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రం వారు అక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండటం వీటి ప్రత్యేకత. అందుకే, కచ్చితంగా స్థానిక భాష తెలిసి ఉండాలని నియమం పెట్టారు.
Read Also: అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్‌కి రిస్క్!
Follow Us On: Instagram

