దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ‘రాజ్‌భవన్’ (Raj Bhavan)లను ‘లోక్‌భవన్’ (Lok Bhavan)గా, ‘రాజ్‌నివాస్’ (Raj Niwas)లను ‘లోక్‌నివాస్’ (Lok Niwas) లుగా మార్చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తెలంగాణలోని ‘రాజ్‌భవన్’ మంగళవారం నుంచి ‘లోక్‌భవన్’గా మారిపోయింది. గవర్నర్ కార్యాలయం ప్రెస్ విభాగం కార్యదర్శి అధికారికంగా ఈ విషయాన్ని తెలియచేశారు. తక్షణం ఇది అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, విలువలను మరింత ఉజ్వలం కావడానికి, బలోపేతం చేయడానికి రాజ్‌భవన్ పేరును మార్పు చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి అన్ని అధికారిక కార్యకలాపాలు, ఉత్తర్వులు, కరస్పాండెన్స్.. ఇవన్నీ లోక్‌భవన్ పేరు మీదనే కొనసాగుతాయన్నారు. గవర్నర్ అధికారిక బంగళాను ఇంతకాలం రాజ్‌భవన్‌గా పిలుస్తున్నా ఇక నుంచి లోక్‌భవన్‌గా పిలవనున్నట్లు తెలిపారు.
‘సేవాతీర్థ్’ గా PM ఆఫీస్…
ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) పేరు ‘సేవాతీర్థ్’గా మారిపోయింది. ఇటీవల ప్రధాని కార్యాలయం కొత్త భవనంలోకి మారగా, దానిని ఇకపై సేవాతీర్థ్‌గా పిలవనున్నారు. కాగా, రెండు రోజుల కిందట కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం పేరు రాజ్‌నివాస్ నుంచి లోక్‌నివాస్‌గా మారింది. పౌరులతో ప్రత్యక్ష సంబంధాన్ని ప్రతిఫలించేలా, పాలనలో పారదర్శకత, స్పందన పెంచేలా ఇలా పేర్లు మారుస్తున్నట్లు ఎన్డీఏ నేతలు అంటున్నారు. రాజ్‌భవన్, రాజ్‌నివాస్ పేర్లను మార్చాలంటూ రెండేళ్ల కిందట తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి తొలిసారి ప్రతిపాదించారు.
Read Also: సర్, సంచార్ సాథీపై అట్టుడికిన సభ
Follow Us On: X(Twitter)


