తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు వాతావరణం ఒక్కసారిగా మారనుంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు (Rain Alert)  కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇక తెలంగాణలో హైదరాబాద్ (Hyderabad) సహా పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండరాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>