కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ దెబ్బకు మన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) కుప్పకూలిపోయాయి. సౌదీలోని ఆరామ్ కో ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ మరోసారి నాలుగు మిస్సైళ్లతో దాడులు చేసింది. ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 116 డాలర్లకు చేరింది. ఈ దెబ్బతో దేశీయంగా స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి. సెన్సెక్స్ 2500 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 2190 పాయింట్లు నష్టపోయింది. గత వారం రోజులుగా స్టాక్ మార్కెట్లు (Stock Market) పెద్దగా లాభాల్లో కొనసాగట్లేదు.

ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపై వరుసగా దాడులు చేస్తుండటం.. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటం మన దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రధానంగా ప్రభావం చూపిస్తోంది. పైగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ వారం రోజుల్లో 31వేల కోట్ల పెట్టుబడులు వెనక్కు తీసుకున్నారు. ఆ ఒత్తిడి కూడా స్టాక్ మార్కెట్ మీద ఉంది. ఉగాది పండగ రోజు ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఇరాన్ దెబ్బకు ఈ ఒక్కరోజే రూ.14 లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి. ఇప్పటికే గ్యాస్ కొరతతో దేశమంతా అల్లకల్లోలం అవుతోంది. ఇప్పుడు ఆయిల్ కొరత కూడా ఏర్పడితే.. అతిపెద్ద సంక్షోభం తప్పదని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇంకోవైపు భారత ప్రభుత్వం హర్మూజ్ జలసంధి నుంచి మన నౌకలకు అనుమతి లభిస్తోందని చెబుతోంది. ఇతర మార్గాల నుంచి కూడా క్రూడ్ ఆయిల్ సేకరిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసినా.. గతంలో వచ్చినంత స్థాయిలో క్రూడ్ ఆయిల్ దిగుమతులు రావట్లేదని నిపుణులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>