Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజా బడ్జెట్ ప్రవేశబెట్టిన కవిత.. ఫించన్లను రూ.25 వేల కోట్లకు పెంచాలని డిమాండ్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha).. జాగృతి తరపున ఉగాది నాడు ప్రజా బడ్జెట్ ప్రవేశబెట్టారు. ఈ ఏడాది రూ. 2 లక్షల 15 వేల 2 వందల కోట్లతో ప్రజాబడ్జెట్ ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఈసారి నుంచి ప్రతి ఉగాదికి ప్రజా బడ్జెట్‌ని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) ప్రవేశ పెడుతుందని ప్రకటించారు. తాము ప్రతిపాదించిన మొత్తం ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి ఉపయోగపడేలా ఉంటుందని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకే తాము ఈ ప్రజా బడ్జెట్ ను కేటాయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించి.. ప్రజలకు పంచాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి చూసుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశబెట్టబోయే బడ్జెట్‌లో (Telangana Budget) రైతులు, కౌలు రైతులకు, రైతు కూలీలకు రూ.35 వేల కోట్లుకు పెంచాలన్నారు. విద్యా రంగం రూ.30 వేల కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు రూ.25 వేల కోట్లు, పింఛన్లకు రూ.25 వేల కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లు, బీసీ సంక్షేమం రూ.20 వేల కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ.18 వేల కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.10 వేల కోట్లు, మైనారిటీ సంక్షేమం రూ.5 వేల కోట్లు, తెలంగాణ ఉద్యమకారులకు ఇండ్లు, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లకు రూ.5 వేల కోట్లు, కళ్యాణ లక్ష్మీ, తులం బంగారం కోసం రూ.10 వేల కోట్లు, రాజీవ్ యువ వికాసం రూ.5 వేల కోట్లు, యువతులకు స్కూటీల కోసం రూ.5 వేల కోట్లు, యూనివర్సిటీ విద్యకు రూ.2 వేల కోట్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయానికి రూ.100 కోట్లు, కళాకారులకు పింఛన్ రూ.100 కోట్లు, ఎంఎస్ఎంఈ లకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కవిత (Kavitha) డిమాండ్ చేశారు.

Read Also: ఉగాది వేడుకల్లో హరీశ్ రావు.. అనంతరం బాధితులకు పరామర్శలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>