Mobile Popup Ad
Mobile Popup Ad

మెదడు క్లీన్ కావాలంటే ఈ పని చేయండి.. స్టడీలో షాకింగ్ నిజాలు

కలం, వెబ్ డెస్క్: మనం బాగుండాలంటే మన మెదడు (Brain) బాగుండాలి. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహించే మనం మెదడు ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. అసలు ఆలోచించగలుగుతున్నాం కాబట్టి మన మెదడు బాగానే ఉంది? అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మనం పడుకున్నప్పుడు మెదడు విశ్రాంతి తీసుకుంటుందని అనుకుంటాం, కానీ నిజానికి అది అప్పుడు చాలా బిజీగా పని చేస్తూ తనను తాను శుభ్రం చేసుకుంటుంది. నిద్ర అనేది కేవలం అలసటను తీర్చుకోవడమే కాకుండా, మెదడును రిపేర్ చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ అని బోస్టన్ యూనివర్సిటీ పరిశోధన వెల్లడించింది. దీనికి సంబంధించిన కీలక విషయాలను కార్డియాలజిస్ట్  హఫీజా ఖాన్ వివరించారు.

అసలేం జరుగుతుంది

ప్రొఫెసర్ లారా లూయిస్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం, మనం నిద్రపోతున్నప్పుడు మెదడులోకి ‘సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్’ (CSF) అనే ద్రవం ప్రవహిస్తుంది. నిద్రలో మన మెదడు(Brain) లోని న్యూరాన్లు నిశ్శబ్దంగా మారుతాయని, ఆ వెంటనే రక్తం మెదడు నుండి బయటకు ప్రవహిస్తుందని డాక్టర్ హఫీజా తెలిపారు. ఆ ఖాళీ స్థానంలోకి ఈ నీటి లాంటి ద్రవం (CSF) చేరి, లయబద్ధమైన తరంగాల రూపంలో మెదడును పూర్తిగా కడిగేస్తుందని పేర్కొన్నారు.

మెదడు రీసెట్ అవుతుంది

ఈ ప్రక్రియలో మెదడులోని రక్తం ఆక్సిజన్ తరంగాలు (ఎరుపు), సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ తరంగాలు (నీలం) ఒకదాని తర్వాత ఒకటి వస్తూ మెదడును శుభ్రపరుస్తాయని పరిశోధనలో తేలింది. నిద్ర అనేది మన మెదడు, గుండె మరుసటి రోజు కోసం తమను తాము పునరుద్ధరించుకునే, రిపేర్ చేసుకునే, రీసెట్ చేసే ఒక క్రియాశీల ప్రక్రియ అని డాక్టర్ హఫీజా వివరించారు. వయస్సు, పని ఒత్తిడిని బట్టి ప్రతి ఒక్కరికీ రోజుకు 7 నుండి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మెదడు ఆరోగ్యం బాగుండాలంటే సరైన సమయానికి నిద్రపోవడం తప్పనిసరి అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>