ఏపీ ఎలక్షన్​ స్టాఫ్​కు సర్కార్​ శుభవార్త!

క‌లం, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి (Election Duty Staff) ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్​ న్యూస్​ చెప్పింది. త‌మ విధుల‌కు అందించే పారితోషికాన్ని పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సురేశ్ కుమార్ జీవో జారీ చేశారు. కేట‌గిరీల వారీగా పారితోషికంలో మార్పులు చేశారు. అలాగే ఎన్నిక‌ల విధుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌మాదాలు సంభ‌విస్తే చెల్లించే ప‌రిహారంలోనూ మార్పులు చేశారు.

పెరిగిన పారితోషికాలు ప‌రిశీలిస్తే..

ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు రోజుకు రూ.350 పారితోషికం ఇచ్చే వారు. దీనిని రూ.500కు పెంచారు. అలాగే పోలింగ్ ఆఫీసర్‌కు రూ.250 నుంచి రూ.400కు, కౌంటింగ్ అసిస్టెంట్‌కు రూ.250 నుంచి రూ.450కు వేతనం పెంచారు. క్లాస్-IV సిబ్బందికి రోజుకు రూ.150 నుంచి రూ.350కు పెంచగా, కాల్ సెంటర్, కంట్రోల్ రూమ్ సిబ్బందికి రూ.200కు బదులుగా రూ.1,000 లంప్‌సమ్‌గా చెల్లించనున్నారు. మైక్రో అబ్జర్వర్లకు రూ.1,000 నుంచి రూ.2,000కు, క్లాస్-III సిబ్బందికి రూ.1,000 నుంచి రూ.2,000కు, వీడియో సర్వైలెన్స్, వీడియో వ్యూయింగ్, అకౌంటింగ్ టీమ్స్‌లోని క్లాస్-I, II సిబ్బందికి రూ.1,200 నుంచి రూ.3,000కు గౌరవ వేతనం పెంచారు.

ఇక సీఏపీఎఫ్ గెజిటెడ్ అధికారులకు 15 రోజుల వరకు రూ.2,500 నుంచి రూ.4,000కు, 15 రోజులు దాటితే వారానికి రూ.1,250 నుంచి రూ.2,000కు పెంచారు. సీఏపీఎఫ్‌ సబార్డినేట్ అధికారులకు రూ.2,000 నుంచి రూ.3,000కు, ఇతర ర్యాంకుల వారికి రూ.1,500 నుంచి రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఖ‌ర్చుల‌ పరిశీలన విధుల్లో ఉండే అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్, సెక్టార్ ఆఫీసర్, సెక్టార్ పోలీస్ ఆఫీసర్లకు రూ.7,500 నుంచి రూ.10,000కు పెంచారు. డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులకు కనీసం ఒక నెల బేసిక్ పే చెల్లించనున్నారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి భోజనం ఖర్చును రోజుకు రూ.150 నుంచి రూ.500కు పెంచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>