Mobile Popup Ad
Mobile Popup Ad

ఖర్గే షూను చేతితో పక్కకు జరిపిన రాహుల్ గాంధీ, వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ కార్యక్రమంలో పాల్గొని బయటకు వస్తున్నాడు. ఆ సమయంలో ఆయన నడవడానికి అడ్డంగా ఉన్న షూస్‌ను రాహుల్ గాంధీ స్వయంగా తన చేతులతో పక్కకు జరిపారు. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ, తన కంటే పెద్దవారైన ఖర్గే పట్ల రాహుల్ వినయాన్ని ప్రదర్శించారు. రాహుల్ చర్యపై కాంగ్రెస్ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తున్నాయి. పదవులు, హోదా కంటే పెద్దల పట్ల గౌరవం ముఖ్యమని రాహుల్ మరోసారి నిరూపించారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కొనియాడుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>