ఓటు హక్కు కోసం ప్రకాష్ రాజ్‌ సంచలన పిలుపు!

కలం, వెబ్ డెస్క్ : ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి , ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడుకోవడానికి పౌరులందరూ ఒకటై ముందుకు రావాలని ప్రముఖ నటుడు, సామాజిక వేత్త ప్రకాష్‌ రాజ్ (Prakash Raj) పిలుపునిచ్చారు. నవంబర్‌ 7న కేరళలోని కొచ్చి వేదికగా జరగనున్న ‘జంతర్‌ మంతర్‌ @ కొచ్చి’ భారీ నిరసన కార్యక్రమంలో తాను పాలుపంచుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా పౌర సమాజానికి, యువతకు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ శాంతియుత ప్రదర్శనలో ప్రకాష్ రాజ్‌తో పాటు సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే, ఇతర ప్రముఖ సామాజిక నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.

రాజకీయ పార్టీల హద్దులు, కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరై తమ నిరసన స్వరాన్ని వినిపించాలని ప్రకాశ్ రాజ్ కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్య నిరసనలకు ఎదురవుతున్న నేపథ్యంలో, అదే స్ఫూర్తితో కొచ్చిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>