పవన్ కళ్యాణ్‌కు చివరి ర్యాంక్.. ఎందులో తెలుసా!

కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈసారి వెనుకడిపోయారు. మంత్రుల పనితీరుకి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో చివరి స్థానంలో నిలిచారు. పవన్ నిర్వహిస్తున్న అటవీ, పర్యావరణ శాఖ ఫైళ్ల క్లియరెన్సులో చివరి స్థానంలో ఉందని కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. ఈ శాఖకు 100కి 67 పాయింట్లు రాగా.. బీసీ సంక్షేమ శాఖ మాత్రం వందకు వంద మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 18 శాఖలు 90 శాతం పాయింట్లు సాధించాయి.

మంత్రుల పనితీరు మెరుగుపరిచేందుకే..

మంత్రుల పనితీరు మెరుగుపరచడంతో పాటు శాఖల మధ్య సమన్వయాన్ని కోల్పోకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు ఈ ర్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. A, B, C, Dగా ర్యాంకులు వర్గీకరించి.. ప్రతి నెలా ఏ శాఖ ఎన్ని ఫైళ్లు క్లియర్ చేసిందో డేటాను పరిశీలించి.. దాని ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తుంటారు. పనితీరు బాగాలేని మంత్రులను సీఎం చంద్రబాబు స్వయంగా పిలిపించుకుని, సమస్యలు అడిగి తెలుసుకుని.. వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, అటవీ–పర్యావరణ శాఖలు గతంలో టాప్–3లోనే ర్యాంకులు సాధించాయి. ఇటీవల పవన్ శస్త్ర చికిత్స కారణంగా.. విధులకు హాజరు కాకపోతుండటంతోనే ఫైళ్ల క్లియరెన్స్ నిలిచిపోయిందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>