కలం, వెబ్ డెస్క్: కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటంపై ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హర్షం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి అద్భుతమైన తీర్పు ఇచ్చిన కేరళం ప్రజలకు ధన్యవాదాలు. ప్రచారంలో పాల్గొన్న ప్రతి యూడీఎఫ్ కార్యకర్తకు అభినందనలు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే.. ఎంతో తెలివైన, సామర్థ్యం కలిగిన కేరళం ఇప్పుడు యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఎంచుకుంది. త్వరలోనే కేరళం కుటుంబాన్ని కలుస్తాను’ అని పోస్ట్ చేశారు.
కాబోయే సీఎం ఎవరు..?
యూడీఎఫ్ (UDF) ప్రభుత్వం కొలువుదీరనుండటంతో కాబోయే సీఎం ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కేసీ.వేణుగోపాల్, వీడీ.సతీషన్, కె.సుధాకరణ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కేసీ.వేణుగోపాల్ ప్రస్తుతం ఎంపీగా ఉండటంతో పాటు పార్టీకి జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి కావాలంటే.. ఎమ్మెల్యేగా ఏదో ఒక స్థానం నుంచి గెలుపొందాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అదెంత వరకు సాధ్యమో తేలాల్సి ఉంది.
Read Also: మెడి‘కిల్’ దందా.. ప్రజారోగ్యంతో చెలగాటం!
Follow Us On : WhatsApp

