టీవీకే ఘ‌న విజ‌యం.. విజ‌య్‌కి తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల విషెస్‌!

క‌లం వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించింది. తన తొలి ఎన్నికల్లోనే విజయ్ సాధించిన అద్భుత విజయంపై అటు రాజకీయ వర్గాల నుంచి, ఇటు సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు చేశారు.

విజయ్ విక్టరీపై ఎవ‌రేమ‌న్నారంటే…

మొదటి ఎన్నికల్లోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు. మీరు ప్రజల కోసం అంకితభావంతో సేవ చేస్తూ, మరింతగా స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నాను. – మెగాస్టార్ చిరంజీవి

తమిళనాడులో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ అద్భుత విజయాన్ని సాధించిన విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనం. మీ నాయకత్వంలో తమిళనాడు ప్రగతి పథంలో నడుస్తుందని నమ్ముతున్నాను. – సూపర్ స్టార్ మహేష్ బాబు

నా సోదరుడు విజయ్‌కి ప్రత్యేక అభినందనలు. టీవీకే తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విశేషం. ప్రజా సేవలో మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. – వైఎస్ జ‌గ‌న్

తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విజయ్‌కి శుభాకాంక్షలు. ప్రజలతో మీకున్న అనుబంధం, మీ దార్శనికత ఈ ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది. తమిళనాడు అభివృద్ధికి మీ నాయకత్వం తోడ్పడాలని ఆశిస్తున్నాను. – రామ్ చరణ్

అంద‌రూ ముందు సందేహించారు.. ఇప్పుడు పట్టాభిషేకం చేశారు. ఇది మా తెలుగు రాష్ట్రాల్లో జరిగింది, ఇప్పుడు తమిళనాడులోనూ జరుగుతోంది. ఇది ‘అబ్సల్యూట్ సినిమా’.. కాదు ‘అబ్సల్యూట్ పాలిటిక్స్’. తమిళ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. – నాని

మీ విజయం మీ పట్టుదలకు, ప్రజల ప్రేమాభిమానాలకు నిదర్శనం. తమిళనాడు ప్రజలు తమ గళాన్ని గట్టిగా వినిపించారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, కోట్లాది మంది ప్రజలతో ఉన్న లోతైన అనుబంధానికి ప్రతిరూపం. – కాజల్ అగర్వాల్

విజయ్ (Vijay) సార్.. మీకు అభినందనలు! మిమ్మల్ని ఈ కొత్త పాత్రలో చూడటం చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సర్. – రష్మిక మందన్నా

తమిళనాడు రాజకీయాల్లో విజయవంతమైన అడుగు వేసిన విజయ్‌కి అభినందనలు. ఈ విజయం ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉంది. – హరీష్ రావు

పులి గర్జన మొదలైంది! తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. మీరు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉండేవారు, ఇప్పుడు వారి తీర్పును కూడా పొందారు. గో అహెడ్ దళపతి..ఈ చారిత్రాత్మక విజయం ద్వారా తమిళ రాజకీయాల్లో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టినట్లయిందని, రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరికొత్త మార్పుకు శ్రీకారం చుడతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. – మంచు లక్ష్మి

Read Also: మెడి‘కిల్’ దందా.. ప్రజారోగ్యంతో చెలగాటం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>