ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆహ్వానం

కలం, వెబ్ డెస్క్: భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ (PM Modi)కి కూటమి ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికింది. స్పెషల్ ఫ్లైట్ లో భోగాపురానికి చేరుకున్న ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. గిరిజన కళారూపం ‘థింసా’ నృత్యంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోడీకి గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చారు. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం ఏర్పాటు చేశారు.

తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దింది. విమానాశ్రయ (Bhogapuram Airport) స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా భారీ స్థాయి ఏటికొప్పాక కళాకృతి ఏర్పాటు చేశారు. విమానాశ్రయ ప్రాంగణంలో తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది, బంగినపల్లి మామిడి చిత్రాల అలంకరించారు. విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్‌ప్లే వాల్ ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>