కళ్లలో కారం చల్లి.. ఆపై వేటకొడవళ్లతో..!

కలం, వెబ్ డెస్క్ : నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా పెంట్లవెల్లిలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్‌ఎంపీగా, న్యాయవాదిగా సేవలందిస్తున్న మల్లయ్య (55) అనే వ్యక్తిని దుండగులు అత్యంత పాశవికంగా నరికి చంపారు. శుక్రవారం రాత్రి ఈ ఘోరం జరిగింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మల్లయ్య పెంట్లవెల్లిలో తన క్లినిక్‌లో ఉన్న సమయంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి తమకు ఆరోగ్యం బాగాలేదంటూ పేషెంట్ల రూపంలో లోపలికి వచ్చారు. మల్లయ్య వారిని పరిశీలిస్తుండగా, ఒక్కసారిగా ఆయన కళ్లల్లో కారం చల్లారు. అనంతరం ఆయనను క్లినిక్ నుంచి బయటకు, ప్రధాన రహదారిపైకి లాక్కొచ్చారు. వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లతో ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు.

దుండగులు వేటకొడవళ్లతో నరకడంతో తీవ్ర గాయాలైన మల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి భూ తగాదాలే కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>