Mobile Popup Ad
Mobile Popup Ad

జావీద్ మృతిపట్ల రాహుల్ దిగ్భ్రాంతి.. తుమ్మల నివాళి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam)నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జావీద్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. జావీద్ మృతి పట్ల పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జావీద్ మరణ వార్త విని చాలా బాధపడ్డానని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. జావీద్ ప్రజల కోసం, కాంగ్రెస్ (Congress) పార్టీ కోసం అంకితభావంతో పని చేశారని, ఆయన సేవలు ఎప్పటికి గుర్తుండిపోతాయి అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మద్దతు దారులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు రాహుల్ గాంధీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా జావీద్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు.

Read Also: తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: పొన్నం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>